రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా మెలగాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి. సంజీవరావు తెలిపారు. బుధవారం నరసన్నపేట డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత వీటిపై అవగాహన పెంచుకుంటే ప్రమాదాలను నివారించకోవచ్చునన్నారు. ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రయాణంలో జాగ్రత్తలు అవసరమన్నారు.