భూమిని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, వాటి స్థానంలో జనపనార సంచులను వినియోగించాలంటూ ఓ సంస్థ ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నరసన్నపేట పట్టణంలో ఆ సంస్థ జనపనార సంచులను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ. ప్రజలు జనపనార సంచుల వినియోగంపై ఆసక్తి చూపించాలని కోరారు.