నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్ లకు భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం చేపట్టారు. నిర్వాహకులు సాయి కృష్ణమాచార్యులు, జగన్నాధ శర్మ, జగదీష్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి పూజలలో పాల్గొన్నారు.