నరసన్నపేట మండలం బాలసీమ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన పి. షర్మిల ఇటీవల పోలాకి మండలం రాజపురంకి బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో స్థానిక పంచాయతీలో షర్మిల చేసిన సేవలకుగాను సర్పంచ్ ఆరంగి జోష్ణ, స్థానిక మండల వైసీపీ అధ్యక్షుడు పాగోటి గోవిందరావు తదితరులు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సచివాలయ ఉద్యోగులతో పాటు, గ్రామస్థులు పాల్గొని వీడ్కోలు పలికారు.