అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పలువురు మృతి చెందడం బాధాకరమని మాజీ ఉపముఖ్యమంత్రి, జిల్లా వైసిపి అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట వైసిపి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి మృతి కి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల పాటు స్థానిక నాయకులతో కలిసి మౌనం పాటించారు.