నరసన్నపేట లో సుమారు 10 సంవత్సరాల క్రిందట స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది నివాసముండేందుకు నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ నేడు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ సిబ్బంది గతంలో వీటిని వినియోగించుకునేవారు. అయితే నాణ్యత లేని కారణంగా తక్కువ సమయంలోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతోమంది ఎస్పీలు మారుతున్నప్పటికీ దీనిపై దృష్టి సారించకపోవడం శోచనీయం. దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు