రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాలతో ప్రతి ఒక్క ఆటోకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్ఐ అసిరి నాయుడు తెలిపారు. బుధవారం నరసన్నపేట పట్టణంలో ప్రతి ఒక్క ఆటోకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేందుకు 70 మంది ఆటో డ్రైవర్లతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు. ఈ కోడ్ వలన ఆటోలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.