నరసన్నపేట మండలం జమ్మూ గ్రామానికి చెందిన రెడ్డి సతీష్ కు ఉత్తమ రైతు పురస్కారం దక్కింది. గురువారం విజయవాడలో ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ రైతుల పురస్కారం కార్యక్రమంలో భాగంగా సతీష్ కు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ క్రమంలో ఆయనను పలువురు అభినందించారు.