నరసన్నపేట: మరమ్మత్తులు పూర్తి.. రేపటినుండి త్రాగునీరు సరఫరా

77చూసినవారు
నరసన్నపేట పంచాయతీ పరిధిలో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో త్వరతిగతిన చర్యలు చేపట్టామని ఈవో పల్లి ద్రాక్షాయణి బుధవారం తెలిపారు. మోటార్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేసామని, మంగళవారం పైపులైన్లు మరమ్మత్తులు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. జాతీయ రహదారి ఆనుకుని ఉన్న పైపు లీకేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసామని వివరించారు. గురువారం నుండి యధాతధంగా త్రాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్