భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తహసిల్దార్ టీ సత్యనారాయణ తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం కంబకాయ రెవెన్యూ గ్రామంలో సిబ్బందితో కలిసి సదస్సు నిర్వహించారు. స్థానిక గ్రామంలో భూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే రైతులు నేరుగా తమను సంప్రదించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. 20 రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.