నరసన్నపేట మండలం లుకలాం రైతు సేవ కేంద్రంలో రైతులకు వరి విత్తనాలు అందజేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ముసిడిగట్టు సర్పంచ్ సూరన్నాయుడు, లుకలాం మాజీ సర్పంచ్ కన్నేపల్లి లక్ష్మీ ప్రసాద్ రావు తదితరులు పాల్గొని ప్రభుత్వం రాయితీపై రైతులకు అందిస్తున్న వరి విత్తనాలను అందజేశామన్నారు. వ్యవసాయ సహాయ అధికారి లలిత మాట్లాడుతూ ఈ కేంద్రానికి 30 కేజీలతో ఉన్న 373 విత్తనాల ప్యాకెట్లు వచ్చాయని పేర్కొన్నారు.