ప్రజా సమస్యల పరిష్కారానికి తాను మొదటగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలాకి మండలం మబగాం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.