గ్రామ సభల ద్వారా పంచాయతీలలో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు తెలిపారు. గురువారం నరసన్నపేట మేజర్ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో భాగంగా ఆయన పాల్గొన్నారు. సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా గ్రామసభ దృష్టికి తీసుకుని రావాలని ఆయన సూచించారు. సభకు రాని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.