శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన షైనింగ్ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా నరసన్నపేట విద్యార్థి షైనింగ్ అవార్డును అందుకున్నారు. కాకర్ల కార్తికేయ దొర పదవ తరగతి పరీక్షలలో 589 మార్కులు సాధించడంతో ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ క్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి కార్తికేయను అభినందించారు.