మోడల్ పాఠశాలకు వెళ్తున్న సమయంలో శుక్రవారం ఆటో బోల్తాపడి శ్యామ్ చరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీకాకుళంలోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. రోజువారి కష్టంతో బతుకుతున్న ఆ కుటుంబానికి ఈ ప్రమాదం పిడుగులా వచ్చి పడింది. తండ్రి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.