నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభచాటిన ఇంటర్మీడియట్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. బుధవారం స్థానిక కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా గతేడాది జరిగిన ఇంటర్ పరీక్షలలో భాగంగా స్థానిక కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ ఎం. పవన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికలు, పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు. విద్యార్థులను పలువురు అభినందించారు.