కూటమి ప్రభుత్వం హయాంలో రహదారుల అభివృద్ధికి పెద్ద పేట వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం దేవాది నుండి పోలాకి మండలం మబుగాం గ్రామం వరకు కోటి రూపాయలతో నిర్మించునున్న రహదారి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.