నరసన్నపేట: స్వర్గీయ టంకాల బాబ్జి సేవలు ఎనలేనివి

71చూసినవారు
నరసన్నపేట: స్వర్గీయ టంకాల బాబ్జి సేవలు ఎనలేనివి
స్వర్గీయ టంకాల బాబ్జి సేవలు మరచిపోలేనివని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ కొనియాడారు. శుక్రవారం నరసన్నపేటలో టంకాల బాబ్జి జయంతి, వర్ధంతి ఒకేరోజు జరిగాయని ఈ క్రమంలో ఆయన శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన గతంలో చేసిన సేవలు మరువలేనివని, సర్పంచ్ గా ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్