పిల్లలు వద్దనుకునేవారు సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వెయ్యాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట ఏరియా హాస్పిటల్ లో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అవాంచిత గర్భం దాల్చేవారు, అక్రమ రీతిలో గర్భం వచ్చేవారు వారి పిల్లలను చెత్తకుప్పల్లో పెట్టకుండా వేయొద్దని సూచించారు. ఇటువంటి పిల్లలని చట్ట ప్రకారం దత్తత ఇవ్వటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.