నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద డాగ్ స్క్వాడ్ తో వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసన్నపేట పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా నియంత్రించేందుకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. బస్సులు, లగేజీ వ్యాన్లు, లారీలు తో పాటుతోపాటు పలు వాహనాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించారు.