రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందని నరసన్నపేట నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త బగ్గు అర్చన పేర్కొన్నారు. నరసన్నపేట టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి ప్రభుత్వం ఏడాది పాలన జరిగిన సందర్భంగా ఆమె ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.