నరసన్నపేట: పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయండి

83చూసినవారు
నరసన్నపేట: పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయండి
నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ కేసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని నరసన్నపేట సి ఐ జె శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో పోలాకి ఎస్సై రంజిత్, జలుమూరు ఎస్సై అశోక్ బాబు, సారవకోట ఎస్సై అనిల్ కుమార్ తో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసులను త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్