సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట పట్టణంలోని భవానీపురం, బ్యాంకు వీధి, బైరాగి వీధులలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వికలాంగులను ఆదుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం 3000 నుండి 6000 పెన్షను అందజేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు