నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీసీఈ వారి ఆదేశాలు మేరకు ఈ నెల 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ పి. లత ఒక ప్రకటనలో తెలిపారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. ఈ సందర్బంగా ఎస్. పరమేశ్వరరావు విద్యార్థులచే వివిధరకాల యోగాశానాలు, సూర్య నమస్కారాలు చేయించారు.