నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాల వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ భవిష్యత్తు యువతపైన ఆధారపడి ఉందని, వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.