జలుమూరు మండలం సైరిగాం పంచాయతీలో పలువురు నకిలీ దివ్యాంగ ధ్రువపత్రాలతో పింఛను పొందుతున్నారని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 20న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సదరం ధ్రువపత్రాల నిర్ధారణకు హాజరు కావాలని 33 మంది పింఛనుదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దర్యాప్తునకు హాజరు కాకపోతే అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగిస్తామన్నారు.