నరసన్నపేట: పంచాయతీలలో యోగాంధ్ర కార్యక్రమాలు

65చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఎంపీడీఓ ఎం. రేణుక ఆదేశించారు. బుధవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఉన్న గ్రామాలలో యోగాసనాల కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నారు.

సంబంధిత పోస్ట్