నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పల్లా శిరీష ఒంగోలు త్రిబుల్ ఐటీలో స్థానం సంపాదించుకుందని స్థానిక హెచ్ఎం పైడి వెంకట్రావు తెలిపారు. గురువారం విడుదలైన ఈ ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. పదో తరగతిలో 572 మార్కులు సాధించిన శిరీష స్థానిక బిసి బాలికల వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసించిందని హెచ్ఎం తెలియజేశారు.