పోలాకి మండలం ఉర్జం, నందిగాం చుట్టుపక్కల గ్రామాల్లో బుధవారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈనెల 29 తారీఖున శ్రీకాకుళంలో జరగబోయే ఎస్సీ ఏబీసీడి విభజనకు వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొనడానికి ప్రచారం నిమిత్తం పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో లుండ వెంకటరమణ, ఎర్రం నాయుడు, ఎస్సీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.