భగవద్గీత భగవంతుని దివ్యవాణి అని దానిని ప్రతి ఒక్కరు అనుసరించాలని శ్రీ స్వామి రామయోగి సేవాశ్రమం వ్యవస్థాపకులు బమ్మిడి విశ్వనాథం అన్నారు. ఆదివారం పోలాకి మండల కేంద్రంలో బొడ్డేపల్లి అప్పలనాయుడు స్వామి రచించిన సర్వోపనిషత్ సత్సంగ అద్వైత భగవద్గీతను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమంలో చిక్కోలు చాగంటి బ్రహ్మశ్రీ ఇప్పిలి రామకృష్ణశర్మ, వక్తలు కరుకోల అనంతరావు, లక్షణరావు స్వామి తదితరులు పాల్గొన్నారు.