పోలాకి మండలం ప్రియాగ్రహారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా తలగాన జగదీశ్వరరావు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బోటనీ అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పదోన్నతిలో భాగంగా ప్రిన్సిపాల్ గా పదోన్నతి కల్పిస్తూ ప్రియాగ్రహారంలో నియమించారు. ఈ క్రమంలో స్థానిక అధ్యాపక బృందం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.