నరసన్నపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న గ్రిక్స్ పోటీలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. శుక్రవారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు మానసిక ఉల్లాసం పొందేందుకు నిర్వహిస్తున్న ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.