పోలాకి మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రహదారులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం ప్రారంభించారు. మండలంలోని తోటాడ, సంత లక్ష్మీపురం, డోల రహదారిలో రెండు కిలోమీటర్లు మేర కోటి 20 లక్షల రూపాయలతో ఇటీవల పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదని తమ ప్రభుత్వ హయాంలో దీనిని సాధించుకోగలిగామని పేర్కొన్నారు.