రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రహదారుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం పోలాకి మండలం కొల్లివలస గ్రామం నుంచి మబగాం గ్రామం వరకు రూ. కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాల్లో రహదారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.