పోలాకి మండలం వనవిష్ణుపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందిన పాలిన వీరస్వామి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహయం అందించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం వీరస్వామి భార్య పార్వతికి రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన స్పందించి రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారని వివరించారు.