జనాభా పెరుగుదలతో సమాజ అభివృద్ధికి విఘాతం

69చూసినవారు
జనాభా పెరుగుదలతో సమాజ అభివృద్ధికి విఘాతం
జనాభా పెరుగుదలతో సమాజ అభివృద్ధి జరిగేందుకు విఘాతం ఏర్పడుతుందని వైద్యాధికారులు సుజాత, అరవింద్ తెలిపారు. నరసన్నపేట మండలం ఉర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో కుటుంబాలు కూడా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. జనాభా నియంత్రణ పట్ల ప్రతి కుటుంబం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్