నరసన్నపేట మండల కేంద్రంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. నరసన్నపేట పరిధిలో ప్రధాన రహదారి, మారుతీ నగర్, లక్ష్మీ నగర్, కంబకాయ రహదారి, జయలక్ష్మి నగర్, పచోరి కాలనీలలో మరమ్మతుల కారణంగా అంతరాయం ఉంటుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలియజేశారు.