నరసన్నపేట మండలం కరగాం పంచాయతీ అడవి నారాయణ వలస పంచాయతీలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాఖీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ అభయ ఆంజనేయ మండలి నిర్వాహకులు సిమ్మ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు సుదీర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీ కడుతూ 'నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష' అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.