నరసన్నపేట మండలం చిన్నకరగాం నుంచి నర్సింగపల్లి గ్రామం వరకు రూ. 90 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపర్చేందుకు పల్లె పండగ కార్య క్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు ఉన్నారు.