సారవకోట మండలం కుమ్మరి గుంట జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కుమ్మరి గుంటకు చెందిన కలివరపు తిరుమలరావు బహిర్భూమి కి రోడ్డు దాటి వెళుతుండగా నరసన్నపేట నుండి ద్విచక్ర వాహనంపై మాలువ వెళుతున్న నక్క రామరాజు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తిరుమల రావుకు కాలు విరిగిపోగా రామరాజుకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.