సారవకోట మండలం బద్రి ఎస్సి కాలనీలో సమస్యలతో సతమతమవుతున్నట్లు స్థానిక వాసులు మొరపెట్టుకున్నారు. సమాచారం అందుకున్న నరసన్నపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఎస్సీ కాలనీలో సందర్శించారు. స్థానికులు మాట్లాడుతూ తమకు డ్రైనేజీ సదుపాయం లేదని, త్రాగునీరు కూడా అందడం లేదంటూ ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.