సారవకోట మండలం చీడిపూడి గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి బుడితి నుండి చీడిపూడి ద్విచక్ర వాహనంపై వెళుతున్న రావాడ దేవి ప్రసాద్ కంకర మట్టిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది నరసన్నపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.