సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువగా కొనసాగుతుందని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సారవకోట మండలం పెద్దలంబ పంచాయతీ కూర్మన్నపేట గ్రామంలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ పూట ఎక్కువగా మద్యం, పేకాట జోలికి పోవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు