నరసన్నపేటకు సత్య సాయి ప్రవాహిని వాహనం రాక

55చూసినవారు
నరసన్నపేటకు సత్య సాయి ప్రవాహిని వాహనం రాక
శ్రీ సత్య సాయి ప్రేమ ప్రవాహిని రథం గురువారం నరసన్నపేట పట్టణానికి చేరుకుంది. ఈ క్రమంలో మారుతీ నగర్ సత్యసాయి సేవా సమితి సభ్యులు సత్యసాయి రథానికి ఘనంగా స్వాగతం పలికారు. భక్తుల సందర్శనార్థం నరసన్నపేట మారుతి నగర్ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. సత్య సాయి భక్తులు తరలివచ్చి రథాన్ని దర్శించుకుని అనంతరం హారతులు అందజేశారు. బాబా ప్రేమ ప్రవాహిని రథం రావడం ఆనందదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్