పోలాకి మండలం ఈదులవలస గ్రామం వద్ద ఉన్న ఆదర్శ పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన ఈ ఎన్నికలలో భాగంగా గొడవలు జరగడంతో నేటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని స్థానిక ఎస్సై పి సత్యనారాయణ తెలిపారు. ఈ ఎన్నికలు సాయంత్రానికి ముగుస్తాయని తెలిపారు.