నరసన్నపేటలో సమగ్ర భూ సర్వే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించామని తహసీల్దార్ టి సత్య నారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం అంపలాం రెవెన్యూ గ్రామంలో ఈ సర్వేను మొదలుపెట్టారు. మొదటి విడతలో సుమారు 25 రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే పూర్తి అయ్యిందని వివరించారు. రెండవ విడతలో పైలట్ ప్రాజెక్టుగా అంపలాం గ్రామాన్ని ఎంపిక చేశామని వివరించారు. దీంతో పాటు మరో 8 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు.