పొలాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూడాలని వ్యవసాయాధికారిని సునీత అన్నారు. నరసన్నపేట మండలం బొరిగివలస, చిక్కాల వలస తదితర గ్రామాల్లో నీట మునిగిన వరిపంట పొలాలను ఆదివారం వ్యవసాయ సిబ్బంది పరిశీలించారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారు మడులు, వెదజల్లు పంటపొలాలు నీట మునిగిపోయాయి. నీరు అలాగే ఉండిపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం వర్షం తగ్గుతుందన్న పొలాల్లోని వర్షపు నీటిని బయటకు పంపించాలన్నారు.