శివకేశవ దేవాలయం వార్షికోత్సవాలు

50చూసినవారు
శివకేశవ దేవాలయం వార్షికోత్సవాలు
కొత్తపేటలో శివకేశవ దేవస్థానం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి 3రోజులు పాటు నిర్వహించేందుకు ధర్మకర్తలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు స్వామివారికి విశేషపూజలు జరిపారు. చివరి రోజు కళ్యాణ మహోత్సవం, హోమంతో కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయకమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీసభ్యులు తెలిపారు. ఆలయ ప్రధానఅర్చకులు భాగవతుల గౌరీ శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్