పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేయడం జరిగిందని సీఐ జే శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఉదయం నరసన్నపేట మండలం దేవాది పంచాయతీ వల్లభరావుపేట చెరువు గట్టు వద్ద పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఇందులో రూ. 85వేలతో పాటు రెండు కార్లు, ఐదు టూవీలర్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.