నరసన్నపేట గ్రామ ఇలవేల్పు శ్రీ శాంతామణి దేవి అమ్మవారు పుష్ప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా స్థానిక ఆలయ అర్చకులు బాబు అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తరలి వస్తున్నారని తెలియజేశారు. వచ్చే మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ముర్రాటలతో చెల్లింపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.